బీర్కూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్ తహసీల్దార్ గాండ్ల నారాయణ పేరుమీద ఆయన భార్య గాండ్ల నాగమణి 25 వేల 116 రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, బీర్కూర్ సొసైటీ చైర్మన్ గాంధీ, గాండ్ల సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ అశోక్, సలహాదారులు గంగాధర్, సతీశ్, సంతోష్, …
Read More »Monthly Archives: August 2021
సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 28 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 893 మందికి 5 కోట్ల 48 లక్షల 67 వేల 400 రూపాయల చెక్కులను …
Read More »కామారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా…
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, ఉదయం 10.40 గంటలకు జిల్లా పురోగతిపై …
Read More »ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలన…
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. పరేడ్ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్‌డిఓ …
Read More »మొక్కలకు నీరుపోసి సంరక్షించాలి
ఆర్మూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో భాగంగా హరిత హారం కార్యక్రమములో ఆర్మూర్ రెండవ వార్డులో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మున్సిపల్ సిబ్బంది మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ పియుసి చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రాంతమంతా పచ్చగా చెట్లతో నిండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత …
Read More »ఒట్టేసి చెబుతున్నా
నువ్వు లేని గుండె గాయాల దిబ్బగా మారింది నువ్వు లేని మనసు పీడకలల ఆచూకీ గా మారింది నా మేధస్సును నీ ఆలోచనలు చుట్టుముట్టాయి ఏ క్షణం నువ్వు నా కంట చూసావో ఆ క్షణమే నీకు నా మనసు రాసి ఇవ్వబడిరది దుఃఖాల సాగరాలతో మోసపూరిత మాటలతో నా మనసు కాగితాన్ని తడిపేసి పోయావు పెదాలపై నీ పేరు చిరు సంతకంగా మారే లోపే పదునైన మాటలతో పెదాల …
Read More »దళితబంధు పథకం అమలుచేయాలి…
వేల్పూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు పథకంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు. దళిత బంధు పథకము ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత, దళిత ఉపకులాల వారందరికీ అమలు చేయాలని, హైదరాబాదులో …
Read More »వాహనాల తనిఖీ
వేల్పూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఏఎస్‌ఐ జోహాన వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా మాస్కులు, హెల్మెట్ ధరించాలని అలాగే వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆటోలలో ప్రయాణం చేసే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు వేగంగా నడపవద్దని పేర్కొన్నారు. వాహనానికి …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శనివారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 5 వేల 104 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4 వేల 832 …
Read More »ఆసరా పెన్షన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 57 సంవత్సరాలు దాటిన పేదలైన అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈడిఎం కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్థానిక తహసీల్దార్‌కు లేదా 1100 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని …
Read More »