Monthly Archives: August 2021

పెండింగ్‌ ఉపకార వేతనాల వివ‌రాలు అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ఆపైన విద్యార్థులకు సంబంధించి 2017 18 నుండి 2020 21 వరకు పెండిరగ్‌ ఉపకార వేతనాలకు సంబంధించి సంబంధిత కళాశాలలో ఈ నెల 18 లోగా సంబంధిత శాఖలకు అన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిజేబుల్డ్‌ జిల్లా అధికారులతో …

Read More »

ఉత్తమ హరిత పాఠశాలగా ఉప్పల్‌వాయి జడ్‌పిహెచ్‌ఎస్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాలగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు భూమిని వితరణ చేసిన పర్వ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌ రెడ్డి చొరవతో ఆదర్శ హరిత పాఠశాలగా రూపుదిద్దుకుందని …

Read More »

పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరికిషన్‌ సింగ్‌ సోధి, జనరల్‌ మేనేజర్‌ సాజి కొరియన్‌ కలెక్టర్‌ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …

Read More »

రుణ లక్ష్యాలు సాధించిన వారికి సన్మానం…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలు సాధించిన వారికి ఆగస్టు 15 రోజున సన్మానం చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఆగస్టు 15 లోగా 55 శాతం లక్ష్యాలను పూర్తి చేసినవారికి సన్మానం చేయనున్నట్లు చెప్పారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10`12 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 6 వేల 193 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5 వేల 905 …

Read More »

బాలల అదాలత్‌ కు 650 దరఖాస్తులు

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల అదాలత్‌ కార్యక్రమానికి సంబంధిత ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని 650 దరఖాస్తులు పలు సమస్యలపై స్వీకరించడం జరిగిందని కమిషన్‌ చైర్పర్సన్‌ శ్రీనివాస రావు తెలిపారు. బాలల అదాలత్‌ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు

జగిత్యాల, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ – చుక్క రమేష్‌ లిద్దరూ నెల గడువులోనే గత జూన్‌ – జులై మాసాలలో చనిపోయారు. వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య (13) చుక్క నాగలక్ష్మి (10) లు తల్లిదండ్రులు లేని, ఉండడానికి గూడు కూడా సరిగా లేని అనాధలయ్యారు. వీరి …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటని కామారెడ్డి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు హాలులో జస్టిస్‌ కేశవరావు సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్‌ కేశవరావు అంచలంచలుగా ఎదిగి …

Read More »

సమిష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ జె. శ్రీనివాస రావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్‌ ఇతర సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో బాల …

Read More »

అర్థశాస్త్రం విభాగంలో రవీందర్‌ నాయక్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకులు ఎం. రవీందర్‌కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డ్‌ ప్రదానం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.బి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎం. రవీందర్‌ ‘‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు – ప్రత్యేక అధ్యయనం, నిజామాబాద్‌ జిల్లాలోని లంబాడాలకు పరిమితం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »