కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఎన్.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్ కేర్ కేంద్రంను జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియచే ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, పుండ్లు …
Read More »Monthly Archives: August 2021
రుణమాఫీ అమలులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు, హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలులో విఫలం అయిందని ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం …
Read More »టీయూ కెమిస్ట్రీ క్యాంపస్ డ్రైవ్
డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తుందని …
Read More »పిజి పరీక్షల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిజి, ఎంబిఎ పరీక్షలు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబిఎ మూడవ సంవత్సరం సెప్టెంబర్ 13 నుండి 18వ తేదీ వరకు పిజి, ఎంబిఎ రెండవ సంవత్సరం సెప్టెంబర్ 22 నుండి 26వ …
Read More »టీఎస్ ఎడ్‌సెట్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. …
Read More »మాస్టర్ ప్లాన్‌లో రింగ్ రోడ్డు రద్దు చేయండి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో హైదరాబాద్ రోడ్ నుండి గాయత్రి నగర్, చంద్ర నగర్, వివేకానంద నగర్, సాయి నగర్ వర్ని రోడ్డు వరకు ఉన్న వంద ఫీట్ల రోడ్డు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని, పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన అనేక మంది ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారని, అలాంటి వారందరూ ఈ రోడ్డు మూలంగా నిరాశ్రయులు …
Read More »ఆలూరులో ఘనంగా ఊర పండగ…
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఆలూరు గ్రామంలో 18 గ్రామ దేవతలను కొలిచి డప్పు వాయిద్యాల నడుమ, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని 18 అమ్మవార్ల దగ్గర గంగాపుత్రులతో డప్పు వాయిద్యాలతో ముడుపు వేసి నియమ నిబధనలతో మొక్కి శనివారం రోజున …
Read More »నేను నువ్వేకదా నేస్తమా!
నిన్ను కలిసాకే తెలిసిందిస్నేహం నిజస్వరూపంనీతో మాట్లాడాకే వదిలిందిఅనాదిగా నన్నంటి విడువనితాపం కొన్నాళ్లక్రితం మనం అజ్ఞాతవాసులంకానీ… ఇప్పుడు!మన ఇరువురి చిరునామా ఒక్కటేఅదే స్నేహం ఎడారి మొక్కలుగావుండే మనముఎల్లలు దాటిన అనుభూతినిపొందుతామనినేనెప్పుడూనా ఊహల పొలిమేరల్లోకి కూడా నేను అడుగుపెట్టలేదు నా జీవనయానంలోఅటకెక్కించిన మధురస్మ ృతులుఎలా విప్పమంటావు! ఐనాకొంతమేరకు ప్రయత్నిస్తా.. నేను పడిన కష్టాలలో పేరు మాత్రమే నాదిఖర్మ అనుభవించేది నువ్వేసంతోష సరోవరంలో నన్ను మాత్రంతనివితీరా స్నానం చేయించేవాడివిచేతిలో చిల్లిగవ్వ లేకున్నామనం పస్తులున్న క్షణాలను …
Read More »