నిజామాబాద్, ఆగస్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ హైవే 63 పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో – ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఎన్‌హెచ్ 63 పనులు 80 శాతం పూర్తి అయినందున మిగతా 20 శాతం రెండు రోజుల్లో …
Read More »Monthly Archives: August 2021
తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టు దారుణం
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని దీనిని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ ఖండిస్తున్నామనీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్ అశోక్ కాంబ్లే అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్న తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం ఖండిస్తున్నామని, …
Read More »లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
బోధన్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలును …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం…..
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్ మానవత దృక్పథంతో ఆయుష్ బ్లడ్ బ్యాంకు నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ వైద్యశాలలో రాములు అనే పేషెంట్‌కు ఐసియూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుడడంతో వారికి బీ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించదం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో …
Read More »వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …
Read More »ఆర్‌అండ్‌బి హరితహారం భేష్
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు నిర్వహణ బాగుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబడినట్లు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ గతంలో 20-30 సంవత్సరాల క్రితం జులై మాసంలో …
Read More »సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలి
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండిరగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్ సంబంధించి …
Read More »నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ పనులు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఫారెస్ట్ రీజనరేషన్‌పై ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు …
Read More »గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా …
Read More »పీ.ఎఫ్ రీజినల్ కమీషనర్ మొండి వైఖరి విడనాడాలి
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల పట్ల ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం రీజనల్ కమీషనర్ సుశాంత్ పాదే మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో పీ.ఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్‌ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్ …
Read More »