కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్ తండాకు చెందిన భుమన్ రుస్తాకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగా, భూమన్ రుస్తా (20) కి పురిటి నొప్పులు అధికం అవడంతో ఆమెకు ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు.
బిడ్డ మెడ చుట్టూ బొడ్డు త్రాడు చుట్టుకొని ఉండడం, సాధారణ ప్రసవం జరిగే పరిస్థితి లేక పోయినప్పటికీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది చాలా చాక చక్యంగా సాధారణ ప్రసవం చేసి తల్లి బిడ్డలను కాపాడారు. మొదటి కాన్పు కావడంతో మగబిడ్డ జన్మించినది. పుట్టిన పసిబిడ్డ ఎలాంటి శ్వాస తీసుకోక పోవడంతో, వెంటనే అంబు బ్యాగ్ ద్వారా కృతిమ శ్వాస అందిస్తూ, సిపిఆర్ ద్వారా బిడ్డను సురక్షితంగా కాపాడారు.
తదుపరి వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించారు. సరిjైున సమయంలో వైద్య సేవలు అందించి, తల్లి బిడ్డలను కాపాడిన 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- అంజయ్య, పైలట్- రామశంకర్‌లను, రుస్త భర్త గోపాల్, గుర్జాల్ గ్రామస్తులు పలువురు అభినందించారు.