ముప్కాల్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యువనాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు, పటేల్స్, రజక యూత్ సభ్యులు మొత్తం 100 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి మల్లికార్జున్రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీను, మండల అధ్యక్షులు గిరి స్వామి, మండల ఉపాధ్యక్షులు లింబాద్రి, మండల జనరల్ సెక్రెటరీ బర్కుంట సాగర్, గంగ శ్రీను, సీనియర్ నాయకులు సతీష్, గోపాల్, నవీన్, మాజీ ఎంపిటిసి రాజన్న పాల్గొన్నారు.