Daily Archives: September 2, 2021

18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ తీసుకోవాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుండారం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు.సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ఒక్క సీసీ కెమెరా 100 మంది …

Read More »

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జ్ఞానేశ్వరి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ …

Read More »

కొండూరు గ్రామంలో పోలీసు కళాబృందం అవగాహన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొండూర్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మూఢ నమ్మకాలను నమ్మవద్దని, మహిళలను, వేదిస్తే షీ టీం నెంబర్‌ 9490618029 లేదా డయల్‌ 100 కి ఫోన్‌ చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని,హెల్మెట్‌ తప్పనిసరిగా …

Read More »

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 4 నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. విద్యార్థులు ధ్రువపత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కౌన్సెలింగ్‌ గడువును పొడిగించాలని ఉన్నత విద్యామండలికి కొన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి. దానికితోడు జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు ప్రక్రియ …

Read More »

సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పచ్చదనం పారిశుద్ధ్య నిర్వహణతో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో రెవిన్యూ డివిజనల్‌ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఉపాధి హామీ అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు, జిల్లా అధికారులతో పల్లె ప్రగతి, పట్టణ …

Read More »

రోడ్లకు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు నాటాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని పిఆర్‌ రోడ్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో పిఆర్‌ రోడ్స్‌లో ఎవిన్యూ ప్లాంటేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పంచాయతీ రాజ్‌ రోడ్స్‌కు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు …

Read More »

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మిత

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చదువుకొని ఇటీవలే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మితను వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ అభినందించారు. న్యాయమూర్తిగా భవిష్యత్తులో ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుస్మిత 2015`18 సంవత్సరాల మధ్య తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తాను ఉన్నత స్థాయిని చేరుకునేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో …

Read More »

ఘనంగా తెరాస జెండా పండుగ

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రాజధాని ఢల్లీిలో శుక్రవారం టిఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెరాసపార్టీ జెండా పండుగను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ …

Read More »

న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా ఆచార్య వినోద్‌కుమార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య గాలి వినోద్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో న్యాయశాస్త్ర విభాగం ఎంతో అభివృద్ధిని సాధించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ ఆకాంక్షించారు. ఆచార్య వినోద్‌కుమార్‌ న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య పి.కనకయ్య, న్యాయశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్‌ స్రవంతి, ఆచార్యులు డాక్టర్‌ ఎల్లోసా, డాక్టర్‌ …

Read More »

వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిదని, పేద విద్యార్థులకు ఉచిత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »