డిచ్పల్లి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య గాలి వినోద్ కుమార్ మార్గదర్శకత్వంలో న్యాయశాస్త్ర విభాగం ఎంతో అభివృద్ధిని సాధించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య డి.రవీందర్ ఆకాంక్షించారు. ఆచార్య వినోద్‌కుమార్ న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్ అభినందించి సన్మానించారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య, న్యాయశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్ స్రవంతి, ఆచార్యులు డాక్టర్ ఎల్లోసా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ నాగజ్యోతి పాల్గొన్నారు.