నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
మూఢ నమ్మకాలను నమ్మవద్దని, మహిళలను, వేదిస్తే షీ టీం నెంబర్ 9490618029 లేదా డయల్ 100 కి ఫోన్ చేయాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని,
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల నేరాలు అరికట్టవచ్చన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకొవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐపి లింబాద్రి (ఎస్హెచ్వో), కొండూరు సర్పంచ్ అశోక్, పోలీస్ కళాబృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.