కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు.
జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మహ్మద్ అలీ షబ్బీర్ నియమింప జేసినందుకు, మరింత సేవ చేసే భాగ్యం కల్పించినందుకు షబ్బీర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.