డిచ్పల్లి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చదువుకొని ఇటీవలే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సుస్మితను వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య డి.రవీందర్ అభినందించారు. న్యాయమూర్తిగా భవిష్యత్తులో ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుస్మిత 2015`18 సంవత్సరాల మధ్య తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.
తాను ఉన్నత స్థాయిని చేరుకునేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చదువుకున్న విద్య ఎంతో తోడ్పడిరదని సుస్మిత అన్నారు. న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సుస్మితను సన్మానించారు. కార్యక్రమంలో విభాగం అద్యక్షులు డాక్టర్ స్రవంతి, ఆచార్యులు డాక్టర్ ఎల్లోసా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ నాగజ్యోతి పాల్గొన్నారు.