నిజామాబాద్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై 20న తుది నిమజ్జన శోభాయాత్ర ఊరేగింవుతో ముగుస్తుందని, శోభాయాత్ర సమయంలో ప్రజాక్షేమాన్ని, శాంతి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
గణేష్ మండప నిర్వాహకులందరు తమ బృందం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ ఈనెల 10లోపు పూర్తిచేసుకోవాలన్నారు. కమీషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ల సిబ్బంది ఆన్‌లైన్ నమోదు ప్రక్రియకు సహకరించేవిధంగా ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి తమ తమ పోలీసు స్టేషన్ సిబ్బంది సహకారంతో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తిచేయాలని కమీషనర్ కార్తికేయ అన్నారు.
వినాయక మండప నిర్వాహక బృందం ఐదుగురి సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్లతో సహా నమోదు చేయించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదలచుకుంటే ముందుగా అనుమతి పొందాలన్నారు. నిమజ్జనం చేసే ప్రదేశం, ఉపయోగించే వాహనం వివరాలు ముందస్తుగా తెలియపరచాలని చెప్పారు.