పోషణపై విస్తృత అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషణ మాసోత్సవాలపై మారుమూల ప్రాంతాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోషణ మాసోత్సవాలు, భారీ వర్షాలు, వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, విద్యా శాఖలో వ్యాక్సినేషన్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు మున్సిపాలిటీలో బృహత్‌ పట్టణ, టీఎస్‌ ఐపాస్‌పై సంబంధిత అధికారులతో సమావేశంలో పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆరోగ్యంపై మారుమూల ప్రాంతాలలో అవగాహన కల్పించాలని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. రెండు రోజులపాటు అధిక వర్షాలు ఉన్నాయనే సూచన ప్రకారంగా పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, సంబంధిత శాఖల అధికారులు ప్రతి ఒక్కరు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడ విద్యుత్‌ వల్ల ప్రమాదాలు జరిగినా కలెక్టరేట్‌ కంట్రోల్‌ నెంబర్‌ 08462220183 కు, విద్యుత్‌ శాఖ 9440811590 నంబర్లకు కాల్‌ చేయాలని తెలిపారు.

వినాయక చవితికి సంబంధించి మున్సిపల్‌, మండలాల వారీగా పీస్‌ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఎల్లుండిలోగా పీస్‌ కమిటీలు విద్యుత్‌ వల్ల ప్రమాదాలు జరగకుండా మండపాల దగ్గర ఫైర్‌ యాక్సిడెంట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్కూల్స్‌, కాలేజీ ఇన్స్టిట్యూషన్‌లలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

హాస్టళ్లలో శుక్రవారం వరకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలన్నారు. ఎడ్యుకేషన్‌ ప్రాపర్‌గా పర్‌ఫెక్ట్‌గా ఉంటేనే మంచిదని, స్పెషల్‌ ఆఫీసర్‌గా ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో పరిశీలించాలన్నారు. హరిత హారంలో జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ పూర్తయిందని జియో ట్యాగింగ్‌ కొంత మిగిలి ఉందని దాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరవై ఏడు మండలాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, మున్సిపాలిటీలో బృహత్‌ పట్టణ ప్రకృతి వనాలు పూర్తిచేయాలని అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ సంబంధిత కమిటీ సభ్యులతో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వెంటనే నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. అనంతరం పోషణ మాసోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, డీఎఫ్‌వో సునీల్‌ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »