కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం మల్లు పేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని ఉపాధ్యాయురాలిని నిన్న ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైనందుకుగాను సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం మల్లు పేట గ్రామానికి, పాఠశాలకి గర్వకారణమన్నారు. మరింత స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు మార్గదర్శకులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లి పెట్టు ఎంపీటీసీ జూకంటి సుజాత బాపురెడ్డి, సర్పంచ్ బాలకిషన్, ఎస్ఎంసి చైర్మన్ మహేష్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.