ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుమార్‌ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో మనం ఎవరికీ రక్తం ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకునే కంటే మనం కానీ, మన కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ మనకు రక్తం ఇవ్వకపోతే ఏమవుతుంది అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాలన్నారు. సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన దాతను అభినందించారు. రక్తదానం చేయాలనుకునేవారు వారి వివరాలను 9492874006 నెంబర్‌కి పంపించాలన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »