నందిపేట్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ సూచన మేరకు నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్, సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న, మాచర్ల గంగారాం, ఆంధ్రనగర్ ఎంపిటిసి ధను శీను, సర్పంచ్ రామారావు, కంటం సురేందర్, ఇన్చార్జి వన్నెల్ కే గ్రామంలో నూతన టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ఆరేపల్లి నవీన్ కుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షులుగా, రైతు విభాగం అధ్యక్షుడు రాయకంటి చిన్నారెడ్డి, యూత్ అధ్యక్షులుగా ఎం. శ్రావణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నందిపేట్ మండల ఎంపిపి వాకిడి సంతోష్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కార్తీక్ రెడ్డి సర్పంచ్ కృష్ణ రెడ్డి, లోక హనుమడ్లు మాజీ సర్పంచ్ సాగర్, కాటిపల్లి గంగారెడ్డి, చిన్నయ్య, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.