కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్ మాజీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి ప్రజలను కాపాడాలని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రజలకు సంఘ సభ్యులకు సూచించారు.