బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం రాజకాన్‌ పెట్‌ గ్రామానికి సంబంధించిన 36 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

అనంతరం బీజేపీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢల్లీి దాకా అంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మ రథం పడుతున్నారని అధికారంలో ఉన్న చోట సుపారిపాలన కోనసాగిస్తూ, అధికారంలో లేని చోట ప్రతి క్షణం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని మరి కొద్ది రోజుల్లో కామారెడ్డి జిల్లా లోకి పాదయాత్ర రాబోతుందని కార్యకర్తలు స్వాగతం పలకడానికి ఉత్సాహంగా ఉన్నారన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »