కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ దోమకొండ మండలం అంబారిపెట్ శాఖ ఆధ్వర్యంలో నేడు గ్రామంలో అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన 85 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు.
గ్రామం పొలిమేరల్లో రమణారెడ్డికి స్వాగతం పలికిన గ్రామ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, పార్టీ జండా ఆవిష్కరించి పార్టీలో చేరే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తారని కెసిఆర్‌కు అధికారం ఇస్తే కుటుంబ పాలన చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
విసిగిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన జరిగే చేరికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వినాయక చవితి సందర్బంగా ఎక్కడైనా మండపాల నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తితే బీజేపీ నాయకుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. నిమజ్జనం జరిగే వరకు అధికారులు మండపాల నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.