Daily Archives: September 13, 2021

ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు 1098

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా కలెక్టర్‌ భవన సముదాయం ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ రోజ్‌ ఆర్గనైజేషన్‌ అద్వర్యంలో చైల్డ్‌ లైన్‌ 1098 స్టాల్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ డి.వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ ఆదికారి సరస్వతి సందర్శించారు. జిల్లా నలు మూలల నుండి పిర్యాదుదారులు, జిల్లా స్థాయి అధికారులు స్టాల్‌ను సందర్శించి వివరాలు …

Read More »

కూతురికి తండ్రి రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబిరావ్‌ పెట్‌ మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన వాణి అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌, రామకృష్ణలను వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కాగా రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాని సమయంలో పేషెంట్‌ తండ్రి నారాయణను గ్రూప్‌ …

Read More »

తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు..

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో తండ్రికి కూతురే కొడుకులా అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం నర్సింలు (40) ఆదివారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింలు మృతి చెందడంతో ఆయన పెద్ద కూతురు నందిని అంత్యక్రియలు నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింలు కుటుంబం పూటగడవని దయనీయ స్థితి, …

Read More »

పంట నష్టం వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశంలో అధిక వర్షం వల్ల దెబ్బతిన్న, ప్రజావాణి దరఖాస్తులు, గణేష్‌ నిమజ్జనం, హరితహారం, స్కూల్స్‌ విసిట్‌పై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట, వ్యవసాయ శాఖ, రోడ్లు, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి బ్రిడ్జిలు, ఇరిగేషన్‌ ట్యాంకులు, ఇండ్లు …

Read More »

మాచారెడ్డిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, ముఖ్య అతిథిగా రాష్ట్ర టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ హాజరోద్దిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం శ్రీ …

Read More »

శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న చత్రపతి శివాజీ విగ్రహం కోసం సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణదాత రాజేశ్వర్‌ మాట్లాడుతూ పడగల్‌ గ్రామం ప్రవేశం ద్వారం వద్ద చత్రపతి శివాజీ విగ్రహం ఉండాలని ఆలోచనతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నరెడ్డి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, …

Read More »

గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యువల్‌ చేయాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీని ఈ విద్యాసంవత్సరం రెన్యువల్‌ చేయాలని 18 నెలలుగా పెండిరగ్‌లో ఉన్న వారి జీతాలని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డిఐఇవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ …

Read More »

వరద బాధితులకు ఐఆర్‌సిఎస్‌ సహాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాల వల్ల వరదలతో నష్టపోయిన బాధితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి రెడ్‌ క్రాస్‌ సంస్థ తరపున గంగాస్థాన్‌లో సోమవారం టార్పాలిన్‌ కిట్స్‌, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రామచందర్‌, సెక్రటరీ ఆంజనేయులు, సొసైటీ కోశాధికారి రవీందర్‌, రామకృష్ణ, పిఆర్‌ఓ, తహసీల్దార్‌ ప్రవీణ్‌ తదితరులు …

Read More »

మౌలిక సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు, పివోడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్‌ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతి పత్రం …

Read More »

దేశాన్ని ప్రైవేటు పరం చేయడమే బీజేపీ లక్ష్యం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా ఇంచార్జ్‌ గొల్ల జాన్‌ హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ ఆరు సంవత్సరాల బాలిక చైత్రకు నివాళులర్పించి అనంతరం నిజామాబాద్‌ నగరంలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »