కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ రోజ్ ఆర్గనైజేషన్ అద్వర్యంలో చైల్డ్ లైన్ 1098 స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ ఆదికారి సరస్వతి సందర్శించారు.
జిల్లా నలు మూలల నుండి పిర్యాదుదారులు, జిల్లా స్థాయి అధికారులు స్టాల్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైల్డ్ లైన్ 1098 సున్నా నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయినా 1098కు కాల్ చేసి సహాయపడాలని చెప్పారు.
ఇంటి నుండి పారిపోయిన లేదా తప్పిపోయిన పిల్లలను చూసినా, బాల్య వివాహాల గురించి తెలిసినా, బాల్య కార్మికులను చూసినా, వదిలి వేయబడిన పిల్లలను అనాథ పిల్లలను చూసినా, ప్రమాదాల బారినపడి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసినా, ఇరుగు పొరుగు/ బడిలో బడి బయట వారి వేధింపులకు, అసభ్య ప్రవర్తన గురించి తెలిసినా లేదా వినినా, నిరాశ్రయులైన పిల్లలను చూసినా, లైంగిక దోపిడీకి గురైన పిల్లలను చూసినా తెలిసినా, పిల్లలకు కుటుంబ సబ్యులనుండి వచ్చే వేధింపులకు, బడి బయటవున్న పిల్లలను బడిలో చేర్చాలనుకున్నా, ఆనాథ పిల్లలు తల్లి లేదా తండ్రి కోల్పోయిన పిల్లలు, చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎక్కడైనా కనిపించినా చూసినా 1098 ఉచితంగా ఏ నెట్‌వర్క్ నుండి అయినా కాల్ చేయవచ్చునని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.
జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా అవగాహన కార్యక్రమాలు ఎక్కడైనా ఆవాసం ఉంటే సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, చైల్డ్ లైన్ 1098 ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అమృత రాజేంధర్, సిబ్బంది, ప్రశాంత్, జ్యోతి, కిషోర్, సురేష్, స్వాతి పాల్గొన్నారు.