వేల్పూర్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వేల్పూరు మండల తహశీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనుండి తెలంగాణ విమోచన జరిగిందని తెలిపారు.
నిజాం పరిపాలన నుండి విమోచన పొందిన ఇతర రాష్ట్రాలు అధికారికంగా విమోచన దినాన్ని చేస్తున్నాయని, తెలంగాణ రాకముందు కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతానని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కేవలం ఓటు బ్యాంకు కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని అన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటించాలని లేదంటే రానున్న రోజుల్లో కెసిఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ప్రభుత్వం బిజెపిదే అని వచ్చిన వెంటనే తప్పకుండా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు మల్లన్న గారి మోహన్, మండల ప్రధాన కార్యదర్శులు వల్లంరవి, భాను చందర్, ఉపాధ్యక్షుడు బెల్దారి నవీన్, ఐటి సెల్ కన్వీనర్ సక్కు, కిసాన్ మోర్చ అధ్యక్షుడు నగేశ్, బాస గంగాధర్, నర్సారెడ్డి, దాసరి రవీందర్, సీనియర్ నాయకులు పన్నాల రాజేశ్వర్, శివ, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.