జగిత్యాల, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకమని, సింగరేణి వారి సహకారంతో మెటుపల్లి పట్టణంలో 15 లక్షల విలువగల 32 సిసి కెమెరాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ సింగరేణి సి.ఎం.డి శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో నేరాలను నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. మెటుపల్లిలో నూతనంగా నెలకోల్పబడిన సిసి కెమెరాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
సింగరేణి వారి సహకారంతో మెటుపల్లిలో సుమారు 15 లక్షల విలువగల 32 సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, సిసి కెమెరాల ఎర్పాటు చేసి నేరాల నియంత్రణలో పరోక్షంగా భాగస్వాములైన సింగరేణి సి.ఎం.డి శ్రీధర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాలను మెట్పల్లి పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయడం జరిగిందని ప్రస్తుత రోజుల్లో ఎలాంటి నేరాలు జరిగిన వాటిలోని నేరస్తులను కనుగొనడంలో సిసి కెమెరాలు పోలీసులకు ఒక అయుధంగా పనిచేస్తాయన్నారు.
సిసి కెమెరాల ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు. సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎర్పాటు చేయడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్ష జరిపి రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఎర్పాటు చేసుకోవాలని కోరారు.
కార్యక్రమములో మెట్పల్లి డిఎస్పి గౌస్ బాబా, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు సదకర్, రాజునాయక్, రాజాప్రమిల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.