టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ, తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్‌, విశిష్ట అతిథులుగా జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్‌ 2న నిర్వహించే రక్తదాన శిబిరంతో పాటు నేడు ప్రజల బాగోగుల దృష్ట్యా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. టీఎన్జీవో నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరంగా ఉందని జిల్లా అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. అలాగే ఉద్యోగుల సమస్యలతో పాటు సమాజసేవలో మేము సైతం ముందుంటామని మరోసారి నిరూపించిన నిజామాబాద్‌ జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

రక్తదాన శిబిరంలో 150కి పైగా ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచినట్టు టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్‌ తెలిపారు. రక్తదానం చేసిన ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్‌ కుమార్‌, సహ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బిఎల్‌ .శంకర్‌, శేఖర్‌, నాగరాజు, సంజీవయ్య, పోల శ్రీనివాస్‌, సత్యం, సాయినాథ్‌ మహిళా కార్యవర్గ సభ్యురాలు వసుమతి దేవి, మంజుల, విజయలక్ష్మి, అన్ని యూనిట్‌ శాఖల అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్‌ కుమార్‌, జాన్‌ శుభాకర్‌, గంగా కిషన్‌ ,గోవర్ధన్‌, అన్ని శాఖల ఫోరమ్‌ అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »