జన్నేపల్లి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని జన్నెపల్లిలో గల ఆరోగ్య కేంద్రంలో గత మూడు రోజుల నుండి కరోనా వాక్సిన్ ప్రకియ నిర్వహిస్తున్నట్టు ఆరోగ్యకేంద్ర ఏఎన్ఎం అనురాధ తెలిపారు. వాక్సిన్ తీసుకోవడానికి భయపడే ప్రజలు ఇప్పుడు స్వచ్చందంగా ముందుకి వచ్చి వాక్సిన్ తీసుకుంటామని ముందుకి రావడం హర్షణీయం అని పేర్కొన్నారు. వాక్సిన్ కొరత కారణంగా డోసులు చాలా తక్కువ వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు మీనా, కవిత, కంధార్ సరితా తదితరులు పాల్గొన్నారు.