కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్.
తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికల కోసం దళిత బందు అంటు ఒక పథకం పెట్టి ఒక్క ఆ నియోజకవర్గ దళితుల కోసం 2 వేల కోట్లు ప్రకటించారు. అయినప్పటికీ కొంత మంది దళితులు, గిరిజనులు కేసీఆర్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. కెసిఆర్ మాయమాటలకు ప్రజలు నమ్మే విధంగా లేరు, ఈ క్రమంలో బస్వాపుర్ గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాలకు చెందిన దాదాపు 50 మంది నాయకులు, మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లం, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.