ఆర్మూర్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ రైతు నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు జన్మదినం ఆర్మూర్‌లోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది రైతులు, యువకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం డి. రామ్ కిషన్ రావు సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు ప్రారంభించారు. 161 మంది యువకులు రక్తదానం చేశారు.
అనంతరం జరిగిన జన్మదిన వేడుకలకు జడ్‌పి ఛైర్మన్ దాదన్న గారి విఠల్ రావు పాల్గొని ప్రసంగించారు. కోటపాటి నరసింహ నాయుడు అనేక సంవత్సరాలుగా చేస్తున్న రైతు ఉద్యమాలు, పసుపు బోర్డు, ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర కొరకు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. వారు చేస్తున్న కృషి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి విజయవంతంగా తీసుకెళ్లగలిగారని తెలిపారు.
కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, బద్దం లింగారెడ్డి, బిఎస్‌పి రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్‌ఎంబి రాజేశ్వర్, జిల్లా ఎల్‌పిజి డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మపురి సురేందర్, జిల్లా కేసీఆర్ సేవాదళ్ నాయకులు రమణ రావు, గల్ఫ్ కార్మికుల రాష్ట్ర నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, మంద భీమ్ రెడ్డి, గంగుల మురళీధర్ రెడ్డి, జిల్లా కమ్మ సంఘం నాయకులు, ఆర్మూర్ ప్రాంత బాపూజీ గృహ నిర్మాణ కార్మిక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఉరే బాలయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏముల రమేష్ గల్ఫ్ కార్మిక నాయకులు, అనేక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గల్ఫ్ కార్మిక నాయకులు మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.