Daily Archives: September 27, 2021

భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన సి.ఎం.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తూఫాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం …

Read More »

జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాన్‌ వల్ల నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ …

Read More »

జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన మరియు రానున్న రెండు, మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. …

Read More »

పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్‌ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల …

Read More »

సాఫ్ట్‌బాల్‌ విజేతలకు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సాఫ్ట్‌ బాల్‌ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌ సన్మానించి అభినందించారు. ఈనెల 19 నుంచి 23 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన 33 వ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జాతీయ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున సౌమ్య రాణి, రాణి, సృజన, సౌందర్యలు పాల్గొని …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట భట్టు తండాకు చెందిన సలావత్‌ విజయ పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సలావత్‌ విజయ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో ఆడబిడ్డకు …

Read More »

శ్రద్దగా ఆలకించిన ప్రజావాణి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ శ్రద్ధగా విన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను విన్న కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులను వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు …

Read More »

కామారెడ్డిలో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ …

Read More »

గాంధారిలో బంద్‌ విజయవంతం

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు చట్టాలకు వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌ బంద్‌ గాంధారిలో విజయవంతంగా జరిగింది. రైతు సంఘాలు, అఖిలపక్షం పిలుపు మేరకు ఏఐసీసీ మద్దతుతో నాయకులు బందులో పాల్గొన్నారు. గాంధారిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. ఉదయం నుండి వాణిజ్య, వ్యాపార సముదాయాలు, స్కూల్స్‌, హోటల్స్‌ మూసివుంచారు. బంద్‌ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని అన్నారు. …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని సోమవారం గాంధారిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న నేతగా పేరుపొందారని నేతలు కొనియాడారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »