గాంధారి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సోమవారం గాంధారిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న నేతగా పేరుపొందారని నేతలు కొనియాడారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంతో పాటు మలి దశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ బాపూజీగా పేరు సంపాదించారని అన్నారు. మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, సర్పంచ్ సంజీవ్ యాదవ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.