గాంధారి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు చట్టాలకు వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ గాంధారిలో విజయవంతంగా జరిగింది. రైతు సంఘాలు, అఖిలపక్షం పిలుపు మేరకు ఏఐసీసీ మద్దతుతో నాయకులు బందులో పాల్గొన్నారు. గాంధారిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. ఉదయం నుండి వాణిజ్య, వ్యాపార సముదాయాలు, స్కూల్స్, హోటల్స్ మూసివుంచారు.
బంద్ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజీల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజ్, అశోక్ రెడ్డి, రవి, వామపక్ష నాయకులు కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.