ఆర్మూర్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని 34వ వార్డులో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిఎసిఎస్ వైస్ చైర్మన్ నర్మేనవీన్, సర్వ సమాజ్అధ్యక్షులు మహేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అన్ని వర్గాలకు అండగా ఉంటున్నారని, అందులో భాగంగా షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు మంజూరు కావడంతో తమ ఇంటి వద్దకు వెళ్లి మంజూరైన చెక్కులను అందజేశారు. మంజూరుకు కృషి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.