కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు వృక్షాలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఇసన్నపల్లిలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ్ కుమార్, ఎంపిఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, సాంకేతిక సహాయకులు జగదీశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.