కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు.
గ్రామాల వారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు, ఇంకా తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ వర్క్ ఫైలు సజావుగా ఉండేవిధంగా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్, డిపిఓ సునంద, అధికారులు పాల్గొన్నారు.