3న జాబ్‌మేళా

కామారెడ్డి, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మదన్‌ మోహన్‌ రావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 3 న జాబ్‌ మేళా నిర్వహించడం జరుగుతుందని టీపీసీసీ ఐటి సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగాలు లేక అనేక మంది యువకులు ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. వారికోసం ఏప్రిల్‌ 3 న జాబ్‌ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, 18 సంవత్సరాల పైబడిన వారు జాబ్‌ మేళాలో పాల్గొనాలని సూచించారు. జాబ్‌ మేళాలో ఎంపికైన వారికి 9 వేల నుంచి 20 వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. దేశంలోనే అతి పెద్ద కంపెనీలు జాబ్‌ మేళాలో పాల్గొంటున్నాయని, ఈ మేరకు 22 కంపెనీలతో తాము అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు వెల్లడిరచారు.

జాబ్‌ మేళా అనేది యువతకు ఉద్యోగ కల్పన కోసం మాత్రమేనని, ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు. కరోన వల్ల జాబ్‌ మేళా ఆలస్యం జరిగిందని, గత సంవత్సరమే జాబ్‌ మేళా నిర్వహించాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ జాబ్‌ మేళా కామారెడ్డిలో జరుగుతుందని, జాబ్‌ మేళా ద్వారా సుమారు 5 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కామారెడ్డి పట్టణంలోని పార్శీరాములు కల్యాణ మండపంలో జాబ్‌ మేళా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా రిజిస్ట్రేషన్‌కు సంబందించిన లింక్‌ యువతకు చేరవేయడం జరిగిందని, జాబ్‌ మేళా రోజు క్యూలో కాకుండా ఓటిపి చెప్తే సంబందిత కంపెనీ ప్రతినిధుల వద్దకు పంపిస్తారని తెలిపారు. సుమారు అరగంట లోపే ఇంటర్వ్యూ పూర్తయి సెలక్షన్‌ పూర్తవుతుందని తెలిపారు.

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో తాను పర్యటించానని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఏ ఎన్నికలు ముందు వస్తే అందులో తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కడ కోరుకుంటే ఆ సెగ్మెంట్‌ నుంచి తాను పోటీ చేస్తానన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరుకు ఆస్కారం లేదన్నారు. ఫ్లెక్సీలు చించినంత మాత్రాన పోయిందేమి లేదని, ప్రజల గుండెల్లో ఎవరికి స్థానం ఉందొ అందరికి తెలుసన్నారు. చిల్లరగాళ్లకు తాను భయపడనని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌ మేళాను ఉపయోగించుకుని ఉద్యోగాలు పొందాలని కోరారు. జాబ్‌ మేళాకు మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ హాజరవుతారని పేర్కొన్నారు.

Check Also

టియులో హోరా హోరీగా అధ్యాపకుల క్రీడోత్సవాలు

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »