నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల వడ్డీ రాయితీ నిదుల పంపిణీ కార్యక్రమంలో మొపాల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఉన్న మోటాటి రెడ్డి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ముందుగా మహిళా సోదరీ సోదరీమణులకు, అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం. అప్పుడే పుట్టిన బాలికలకు కేసీఆర్ కిట్టు 13వేల రూపాయలు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం, బీడీ పింఛన్, ఇలా మహిళలకు పెద్దపీట వేస్తూ సముచిత స్థానాన్ని మహిళలకు కల్పిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ నిదులు విడుదల చేశారని వాటిని మా నియోజకవర్గ మహిళలకు నా చేతుల మీదుగ అందించడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ నిదులు విడుదల పత్రాలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని స్థానిక మహిళ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, డ్వాక్రా మహిళలకు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో లిజిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, సాంబారి మోహన్, ఆర్డిఓ రవి, ఏడు మండలాలకు చెందిన స్థానిక జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపిటిసిలు, డ్వాక్రా సంఘాల సభ్యులు సిఏలు, మెప్మా డిపార్ట్మెంట్ వారు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.