24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ స్లప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చీఫ్‌ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్‌ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ పరీక్షలు, ఒకేషనల్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్షా కంద్రాలను సందర్శించి ఫర్నీచర్‌, విద్యుత్‌, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలును పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటె తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రధమ,ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 10,511 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఇందుకోసం 29 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఉతీర్ణత శాతం తక్కువగా ఉందని ఉదార స్వభావం చూపరాదని, మాల్‌ ప్రాక్టీస్‌, కాపీయింగ్‌ అనుమతించవద్దని తద్వారా జిల్లాకు చెడ్డపేరు రావడమే గాక పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. పరీక్షలు జరుగుతున్నపుడు పరీక్షా కేంద్రాన్ని మొత్తాన్ని కలియ తిరగాలని, పరీక్షలు సాఫీగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఏ చిన్న సమస్య రాకుండా చూడాలని, విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ గాడ్జెస్‌ అనుమతి లేదని, ఒక్క నిముషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించవద్దని సూచించారు. సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయన్నారు.పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలనీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షా కేంద్రాలవద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సమావేశంలో ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం, పరీక్షల విభాగం అధికారులు శ్రీనాథ్‌, నాగేశ్వరయ్య, చీఫ్‌ సూపెరింటెండెంట్లు, శాఖాపర అధికారులు, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అక్రమ నియామకాలను రద్దు చేయాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »