బాల్కొండ, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు.
కాగా బీరువా, వైట్ మార్కర్ బోర్డులను సమకూర్చిన మనోహర్ ట్రస్ట్, మనోహర్, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్ పుష్పాకర్కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్ మార్కర్ బోర్డులు అందించిన చైర్మన్ రమేష్‌కి దయానంద్ ట్రస్ట్ నుండి తమ వంతు సహకారాలు ముందు రోజుల్లో అందిస్తామని తెలిపిన గణేష్‌లను సత్కరించారు.

కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలకు ఫర్నిచర్ అందించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యాలయాలకు అందించడం చాలా గొప్పవని పేర్కొన్నారు, శ్యామ్ కుమార్ ఫర్నిచర్ సమకూర్చిన దాతలను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.