నూతన సంవత్సరంలో జిల్లాను ముందంజలో నిలుపుదాం

నిజామాబాద్‌, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌ లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యార్థుల కోసం దుప్పట్లు, నోట్‌ బుక్కులు అందజేత

కాగా, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల వారు అందించిన దుప్పట్లు, నోట్‌ బుక్కులు, ఎగ్జామ్‌ ప్యాడ్లు, పెన్నులను స్వీకరించిన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేస్తామని అన్నారు. పూల బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థులకు అందించేందుకు వీలుగా బ్లాంకెట్లు, నోట్‌ బుక్కులు తేవాలని కలెక్టర్‌ చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది.

పాలనాధికారిని కలిసేందుకు వచ్చిన వారందరు పెద్ద ఎత్తున దుప్పట్లు, నోట్‌ బుక్కులు తీసుకురాగా, కలెక్టర్‌ వాటిని వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు తోడ్పాటును అందించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రస్తుత చలికాలం బారి నుండి రక్షణ పొందేందుకు దుప్పట్లు ఉపయుక్తంగా నిలుస్తాయని పలువురు హర్షం వెలిబుచ్చారు.

Check Also

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »