కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలు సమర్ధవంతంగా ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.

రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందజేసిన రూల్స్ పుస్తకాలను చదవాలని, ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, ఉపసంహరణ, అప్పీలు, తదితర విషయాలను శిక్షణలో తెలుసుకోవాలని అన్నారు. శిక్షణలను మాస్టర్ ట్రైనర్ ఇవ్వడం జరుగుతున్నదని, ఏమైనా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవాలని అన్నారు.
శిక్షణలో జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.