కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతి లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించబడిన హెడ్ మాస్టర్స్, టీచర్స్‌లకు పోక్సో చట్టంపై ఒక రోజు ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నియమించబడిన ప్రొటెక్షన్ ఆఫీసర్ పాఠశాలలో పిల్లల పట్ల ఎటువంటి లైంగిక దాడులకు గురికాకుండా వాటిని ప్రారంభ దశలోనే అణిచివేసే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనీ, వీటిలో భాగంగా జిల్లాలో ప్రతి స్కూల్ నుండి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు హెడ్ మాస్టర్ లను ఎంపిక చేసి వారికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వీధుల పైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ స్కూల్ కాన్సెప్ట్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా మొట్టమొదటగా కామారెడ్డి జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి యునిసేఫ్ వారి సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోక్సో చట్టం గురించి ఆ చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించే పరిజ్ఞానం హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
వివిధ రకాల వేధింపుల గురించి వివరించడం జరిగింది. జిల్లాలో సమర్థవంతమైన పాఠశాలలను తయారు చేసే దిశగా ప్రతి పాఠశాలలో సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. పోక్సో చట్టంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సీసీ టీవీ కెమెరాల పనితీరును ,అన్ని ప్రదేశాలలో కవరేజ్ ఉండే విధంగా చర్య తీసుకోవాలని సూచించారు. విద్యార్థిని లకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి వివరించాలని తెలిపారు. వేధింపుల సంఘటనలు జరిగినప్పుడు అట్టి విషయాన్ని రిపోర్ట్ చేసే విధంగా విద్యార్థిని లకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్, వరండాలలో సీసీ టీవీ లను ఏర్పాటుచేయాలని సూచించారు. విద్యార్థినిలను స్వంత పిల్లల్లాగ చూడాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలంలో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి సుమారు 500 మంది హెడ్ మాస్టర్ లకు, ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
సి.డబ్ల్యు,సి. మెంబర్ స్వర్ణలత మాట్లాడుతూ, ఆడపిల్లలు హింసకు గురికాకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, యునిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజ్, రెసిడెన్షియల్ పాఠశాలల హెడ్ మాస్టర్స్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులకు బ్యాడ్జెస్ లను కలెక్టర్ పంపిణీ చేశారు.