కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు ఆర్కే డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి పూజించారు. పూజ్య రామకృష్ణ పరమహంస ప్రముఖ శిష్యుడు స్వామి వివేకానందాను ఎట్లాగైతే తీర్చిదిద్ది, ప్రపంచానికి అందించారో, అదే విధంగా గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును ఉత్తమమైన రీతిలో తీర్చిదిద్దుతున్నామని ఆర్కే సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగరాజు హాజరై ఐబీఎం కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెమినార్ ను పరిశీలించి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి వారి వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐలో తగిన రీతిలో శిక్షణ తీసుకుంటే వారి కెరియర్ ఉత్తమంగా ఉంటుందని వారన్నారు.
కార్యక్రమంలో ఐబీఎం ప్రతినిధి ప్రతీక్, ప్రిన్సిపల్స్ సైదయ్య, దత్తాత్రి, నవీన్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గంగాధర్, శంకర్, వైస్ ప్రిన్సిపల్స్, ఏవో, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.