డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్ కుమార్‌ని నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు.
ఆచార్య కే సంపత్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో ఆచార్యులుగా కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అప్లైడ్ స్టాటిసిక్స్ హెడ్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, పి.ఆర్ఓ.గా, నోడల్ ఆఫీసర్‌గా పరీక్షల నియంత్రణ అధికారిగా వైస్ ప్రిన్సిపాల్ గా, పబ్లికేషన్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్. కే సంపత్ కుమార్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.