కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఏం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని ఎన్నికల మెటీరియల్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రైసిడిరగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, జోనల్ అధికారులకు రెండవ దశ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ సిబ్బంది సకాలంలో ఎన్నికల సామాగ్రి తీసుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల సామాగ్రి సేకరించి పరిశీలించుకోవాలి తెలిపారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బంది పై ఎన్నికల నియమావళి మేరకు సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఏమైనా సందేహాలు, సమస్యలు, ఇబ్బందులూ ఉంటే శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
శిక్షణ సమయంలో బ్యాలెట్ బాక్స్ సీలింగ్ ప్రక్రియ ప్రాక్టికల్‌గా నిర్వహించి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. శిక్షణ పై మాస్టర్ శిక్షకులు శిక్షణ అందించారు. శిక్షణ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, తదితరులు పాల్గొన్నారు.