డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ప్రవీణ్ మామిడాలను నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు.
ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్ రిలేషన్స్, ఐక్యూ ఎసి, యూజీ సి విభాగలకు డైరెక్టర్ విధులు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ విభాగంలో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఉన్నత విద్య అనంతరం పరిశోధనల కొరకు చైనా, సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.