బాన్సువాడ, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్స్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సచిన్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉగాది పండుగ రోజున గత ఆరు సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని ప్రజలకు వితరణ చేయడం జరుగుతుందని, ఉగాది పండుగ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసేందుకే తమవంతు ప్రయత్నం చేస్తున్నమన్నారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు గురు వినయ్, తుప్తి నాగరాజు, యువర్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు సచిన్ యాదవ్, శ్రీనివాస్, సాయి కృష్ణ, వేద ప్రకాష్, సాయి తేజ, నవీన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.