కామారెడ్డి, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాలో గల ఎస్సీ సంఘాల నాయకులు, బిసి, వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులుతో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం హాల్, కామారెడ్డిలో నిర్వహించారు.
సమావేశంలో జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, అధికారిక సమన్వయం, అలాగే ఎస్సీ సంఘాల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. కావున, జిల్లాలోని అన్ని ఎస్సీ సంఘాల నాయకులు,బిసి మరియు వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులు జయంతి మహోత్సవాల కు హాజరై ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పత్రిక ప్రకటన ద్వారా ఆశిష్ సాంగ్వన్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి తెలిపారు.