కామారెడ్డి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38)కి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించక పోవడంతో మాచారెడ్డి మండలం లచ్చపేట్ కు చెందిన భూస రాజు మానవతా దృక్పథంతో స్పందించి ఆర్ విఎం వైద్యశాల ఒంటిమామిడి కి వెళ్లి 10 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచినందుకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేస్తూ ఎక్కడ ఎవరికి రక్తం అవసరం ఉన్న స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రక్తదాత రాజు చేస్తున్న కృషి అభినందనీయమని, యువత రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి ప్రాణదాతలు కావాలని అన్నారు.