బాన్సువాడ, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు.
అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.