జక్రాన్‌పల్లి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తొర్లికొండ విద్యార్థులకు పదివేల రూపాయల విలువగల క్రీడ సామాగ్రిని మాజీ ఆలయ కమిటీ చైర్మన్ తొర్లికొండ కాటిపల్లి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉత్కం శ్రీనివాస్ గౌడ్ అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మూడెడ్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులు 36 మంది రాష్ట్ర క్రీడా పోటీలలో, ఐదుగురు జాతీయ క్రీడా పోటీలలో రాణించినందుకు సంతోషిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించడానికి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించుకోవడానికి క్రీడ సామాగ్రి అందజేసిన దాతలు కాటిపల్లి సాయి రెడ్డి, ఉత్కం శ్రీనివాస్ గౌడ్ లను అభినందించారు.
గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతామన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా క్రీడా సామాగ్రి దాతలు కాటిపల్లి సాయి రెడ్డి, ఉత్కం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాల క్రీడాకారులు రాష్ట్ర జాతీయ పోటీలలో రాణించడం పట్ల ఆనందంగా ఉందన్నారు.
తమ వంతు సహాయ సహకారంగా క్రీడా సామాగ్రిని అందజేస్తున్నమని, భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి సొసైటీ చైర్మన్ కాటిపల్లి నర్సారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్మ గంగారెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల గంగారెడ్డి, రాజేష్ గౌడ్, రాజేష్ ఖన్నా, సన్ యాదవ్ మహేష్, యాదవ్, ఉప్పు ప్రసాద్, రణధీర్ గౌడ్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.