డిచ్‌పల్లి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతిని పురస్కరించుకుని ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన డా. బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనలు స్త్రీల హక్కులు – లింగ న్యాయం అనే అంశంపై కార్యశాల నిర్వహించారు.
ముఖ్య అతిథిగా వర్సిటీ ఉప కులపతి ఆచార్య టి.యాదగిరి రావు పాల్గొని మాట్లాడుతూ యువత పెడదూరనులు పడుతున్న నేపథ్యంలో వర్తమాన సమాజంలో స్త్రీల హక్కులు, లింగ న్యాయం అనే అంశం చర్చించడం అత్యవసరమన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు అధ్యాపకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు అధ్యయనం చేసి చైతన్యవంతమైన ఆలోచనల ఆచరణ సమాజానికి తెలియజేయాలన్నారు.

ప్రధాన వక్తగా హాజరైన పాలమూరు యునివర్సిటీ ఆచార్యులు మనోజ మాట్లాడుతూ మహిళల హక్కులు, రక్షణ చట్టాల గురించి, హిందూ వివాహ వ్యవస్థ గురించి, డా.
బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి వలననే భారతదేశంలో మహిళల పరిస్థితి మెరుగైందన్నారు. కుటుంబ వ్యవస్థలో సమానమైన ఆస్తి మహిళలకు లభించాలన్న హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లు వీగిపోవడంతో డాక్టర్ అంబేద్కర్ నిరసనగా తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అయినప్పటికీ రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో సమాన వేతనాలు చెల్లించే చట్టాలు చేయడం, స్త్రీలను గౌరవించి ప్రసూతి సెలవులను ఇప్పించే చట్టాలను చేయడంలో ఆయన కృషి ఎనలేనిది గుర్తు చేశారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రవీణ్ మామిడాల గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల లింగ వివక్ష లేకుండా బాలబాలికలను సమానంగా చూడాలని సూచించారు.
రిసోర్స్ పర్సన్ డా. బి స్రవంతి మాట్లాడుతూ ఆధునిక మహిళలు శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్నారని గుర్తు చేశారు. దీనికి తాజా ఉదాహరణ తొమ్మిది నెలల పాటు అంగారకునీపై పరిశోధనలు జరిపిన వ్యోమగామి సునీత విలియంను గుర్తు చేశారు. అనంతరం ఆచార్య మనోజాను పుష్పగుచ్చమిచ్చి, శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో కామర్స్ డీన్ ప్రో. రాంబాబు సి. ఓ. ఇ. ప్రొ. సంపత్ కుమార్, డా.బీ.ఆర్ నేత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.